home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

ఎర్రని కన్నుల పద్మాల పద్మా


(ప్రతిదినము శ్రీ వెంకటేశ్వరుడు పవళింపు సేవ అనంతరము కొండదిగి వచ్చి పద్మావతీ దేవి వద్ద చేరటం - ఇంతలోనే తెల్లవారక ముందే సుప్రభాత సేవకు కొండ మీదికి వెళ్ళవలసి రావటం- అప్పుడు పద్మావతీ దేవి శ్రీ వెంకటేశ్వరుని ఎడబాటి సహించలేక ఎలా తపించింది అనే కీర్తన ఇది. ఇది పూజలేని భక్తి యని స్వామి చెప్పినారు.)

ఎర్రని కన్నుల  పద్మాల పద్మా
వెంకట రమణుని వీడ్కోలు చెప్పె || (పల్లవి)

1.  రాలు రక్తరుచి బాష్ప పగడముల | చెదరి చలించెడి అలకనీలముల |
ఏడ్వగ కనబడు దంత ముత్తెముల | వణకెడి పెదవుల పల్లవ కాంతుల ||

2.  కంపించెడి కుచభర హృదయముతో | వడగాలి వేడి నిట్టూర్పులతో |
పోవలసినదేనా ? పరమాత్మా | గోవిందా ! నా గోవిందా ! యనె ||

3.  ఒకసారి లేచు ఒకసారి తూలు | ఒకసారి శయ్యపై బడి పొరలును |
అర్ధరాత్రి వరకా ? వేచియుంట ! | అని విలపించును గుండెబాదుకొను ||

4.  ముందుకు వెనుకకు అడుగులు వేయుచు | వెడలుచు తడబడి కన్నీరొలుకుచు |
పద్మా పద్మా అని రోదించెడి | గోవిందుని తానవలోకించెను ||

5.  పది అడుగులు గిరినెక్కియు నిలబడె | వెనుకకు చూచెను విలపించెను హరి |
క్రింద పద్మ నిలబడి పైకి విసరు | బాష్ప తోరణములాకర్షింపగ ||

6.  హనుమయు గరుడుడు ప్రక్కల చేరిరి | భుజములనెత్తుక బలవంతముగా |
కొండపైకి ఎగిరిరి బ్రహ్మర్షులు | నిరీక్షణములను చేయుచుండిరని ||

 
 whatsnewContactSearch