home
Shri Datta Swami

 15 Jan 2002

వేంకటేశ్వరుడు - ఎంగిలి చేసిన

వేంకటేశ్వరుడు - ఎంగిలి చేసిన।
 
తిరుపతి లడ్డును - తిందాము రారె॥ (పల్లవి)
 
భక్తియె చక్కెర - ఙ్ఞానమె బూందియు -
శ్రద్ధయె ఏలా ఫలముల పలుకులు।
ప్రపత్తి తలపులె ఎండిన ద్రాక్షలు -
శరణాగతియే పచ్చకప్పురము॥
 
 
పద్మావతియే స్వయముగ చేసిన -
పెద్ద పెద్దవవి లడ్డులు చూడరె।
మధ్య మధ్యలో సత్సంగములను -
చర్చల వడలను నంచుక తినుచును॥
 
 
భక్తి రసామృత మాధుర్యమయము -
ఎన్ని తిన్ననూ రోగము కానిది।
స్వామి ప్రేమలను లడ్డుల తినవే -
ఆ లడ్డులన్ని వ్యాపారములే॥
 
 
ఙ్ఞానవహ్నితో వండిన వంటలు -
ఎప్పటి కప్పుడు వేడి వేడివవి।
భక్తి గీతములె జీడిపప్పులే -
రుచికరములవియె తినవే పద్మా॥
 
 
అంతరార్థమును తెలియని వారలు -
శాశ్వత నష్టము పొందెదరవనిని।
దిగి దిగి వచ్చిన అవతారములే -
తిరుపతి లడ్డులు ప్రసాదములవియె॥
 
 whatsnewContactSearch