వెంకటేశ్వరుడు - ఎంగిలి చేసిన
తిరుపతి లడ్డును - తిందాము రారె || (పల్లవి)
1. భక్తియె చక్కెర - ఙ్ఞానమె బూందియు - శ్రద్ధయె ఏలా ఫలముల పలుకులు |
ప్రపత్తి తలపులె ఎండిన ద్రాక్షలు - శరణాగతియే పచ్చకప్పురము ||
2. పద్మావతియే స్వయముగ చేసిన - పెద్ద పెద్దవవి లడ్డులు చూడరె |
మధ్య మధ్యలో సత్సంగములను - చర్చల వడలను నంచుక తినుచును ||
3. భక్తి రసామృత మాధుర్యమయము - ఎన్ని తిన్ననూ రోగము కానిది |
స్వామి ప్రేమలను లడ్డుల తినవే - ఆ లడ్డులన్ని వ్యాపారములే ||
4. ఙ్ఞానవహ్నితో వండిన వంటలు - ఎప్పటి కప్పుడు వేడి వేడివవి |
భక్తి గీతములె జీడిపప్పులే - రుచికరములవియె తినవే పద్మా ||
5. అంతరార్ధమును తెలియని వారలు - శాశ్వత నష్టము పొందెదరవనిని |
దిగి దిగి వచ్చిన అవతారములే - తిరుపతి లడ్డులు ప్రసాదములవియె ||