home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

శ్రీ దత్త గుర్వష్టకమ్


గురూణాం గురోర్దత్త దేవస్య సాక్షాత్
మహా జ్ఞాన వారాసి రూపస్య రమ్యే
గురోరంఘ్రి పద్మే మనశ్చేన్నలగ్నమ్
తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్?॥౧॥

సాక్షాత్తూ అనంత ఆధ్యాత్మిక జ్ఞాన సముద్రమైనటువంటి, గురువులకే గురువై, సద్గురువైనటువంటి శ్రీ దత్త దేవుని అందమైన పాద పద్మములయందు, మన మనస్సు నిలుపనట్లయితే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం, మరి ఏం ప్రయోజనం?

త్రిముర్తి స్వరూపస్య దత్తాహ్వయస్య
త్రిలోకాది మధ్యాన్తిమ స్థాన హేతోః
గురోరంఘ్రి పద్మే మనశ్చేన్నలగ్నమ్
తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్?॥౨॥

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏక త్రిమూర్తి స్వరూపమైన, ముల్లోకముల యొక్క ఆది, మధ్య, అంతములకు మూలమైన, సద్గురువైన శ్రీ దత్త దేవుని అందమైన పాద పద్మములయందు, మన మనస్సు నిలుపనట్లయితే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం, మరి ఏం ప్రయోజనం?

నివృత్తి ప్రవృత్తి ప్రబోధ ప్రమాణ -
ప్రకార్శార్థ సన్ధాన దత్త ద్విజస్య
గురోరంఘ్రి పద్మే మనశ్చేన్నలగ్నమ్
తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్?॥౩॥

లోకముతో మన సంబంధ రూపమైన ప్రవృత్తి, పరమాత్మతో మనకు సంబంధము కలిగించే నివృత్తి మార్గములను బోధిస్తూ, తదనుగుణంగా వేదములనుండి సరియైన సందర్భాలను ప్రమాణ సహితంగా ఉట్టంకిస్తూ, తన బోధలకును వేదమునకును అనుసంధానము చేస్తున్న, సద్గురువైన శ్రీ దత్త దేవుని అందమైన పాద పద్మములయందు, మన మనస్సు నిలుపనట్లయితే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం, మరి ఏం ప్రయోజనం?

సముద్ధర్తుమస్మాన్ సమేతస్య భూయో
నరాకారమాశ్రిత్య దత్తస్య భూమౌ
గురోరంఘ్రి పద్మే మనశ్చేన్నలగ్నమ్
తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్?॥౪॥

అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న మానవులనుద్ధరించడానికై పరమ కారుణ్యంతో నరావతారంలో ఈ భూమిపై పదే పదే అవతరిస్తున్న, సద్గురువైన శ్రీ దత్త దేవుని అందమైన పాద పద్మములయందు, మన మనస్సు నిలుపనట్లయితే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం, మరి ఏం ప్రయోజనం?

త్రిదేవాత్మనో దత్తనామ్నో మహర్షేః
శ్రుతిస్మార్త విజ్ఞాన సిద్ధాన్తకర్తుః
గురోరంఘ్రి పద్మే మనశ్చేన్నలగ్నమ్
తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్?॥౫॥

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంతర్యామి రూపంగా వ్యాపించి, ఎవరైతే వేదములకూ, స్మృతులకూ, అలాగే ఆధునిక విజ్ఞానమునకూ సమన్వయం చేసి పరిపూర్ణ సిద్ధాంతాన్ని స్థాపించారో, అట్టి మహర్షియూ సద్గురువూయైన, శ్రీ దత్త దేవుని అందమైన పాద పద్మములయందు మన మనస్సు నిలుపనట్లయితే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం, మరి ఏం ప్రయోజనం?

పవిత్రానసుయాత్రి పుత్రస్య రక్షా -
శ్రితస్యాభితో ధేను ధర్మ శ్వ వేదైః
గురోరంఘ్రి పద్మే మనశ్చేన్నలగ్నమ్
తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్?॥౬॥

పరమ పవిత్రులయిన అనసూయా మాత, అత్రి మహర్షుల పుత్రుడయినట్టి, గో రూపము ధరించిన ధర్మము, శునక రూపమును ధరించినటువంటి వేదములే రక్షణ కొరకు తనను ఆశ్రయించినటువంటి, సద్గురువైన శ్రీ దత్త దేవుని అందమైన పాద పద్మములయందు, మన మనస్సు నిలుపనట్లయితే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం, మరి ఏం ప్రయోజనం?

మహాబ్రహ్మతేజో భిరత్యుజ్జ్వలస్య
సుకాషాయచేలస్య దత్తోత్తమస్య
గురోరంఘ్రి పద్మే మనశ్చేన్నలగ్నమ్
తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్?॥౭॥

చక్కటి కాషాయవస్త్రమును ధరించి, అతి గొప్పదైన బ్రహ్మతేజస్సుతో జాజ్జ్వల్యమానంగా ప్రకాశమును వెదజల్లుతున్న, మహనీయుడైన, సద్గురువైన శ్రీ దత్త దేవుని అందమైన పాద పద్మములయందు, మన మనస్సు నిలుపనట్లయితే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం, మరి ఏం ప్రయోజనం?

సువేదాన్తవర్షాన్త దత్తామ్బుదస్య
క్వచిత్ విద్యుదాఘాత సిద్ధాన్త భాసః
గురోరంఘ్రి పద్మే మనశ్చేన్నలగ్నమ్
తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్ తతః కిమ్?॥౮॥

దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వర్షించే దత్తుడనే మేఘము, మధ్య మధ్యలో తన అపూర్వ శాస్త్ర సిద్ధాంతాలనే చురుక్కుమనిపించే మెరుపులుగా సమన్వయం చేస్తోంది. అట్టి సద్గురువైన శ్రీ దత్త దేవుని అందమైన పాద పద్మములయందు, మన మనస్సు నిలుపనట్లయితే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం, మరి ఏం ప్రయోజనం?

 
 whatsnewContactSearch