home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

సర్వ జీవులకు మొగుడైన మొనగాడా


సర్వ జీవులకు మొగుడైన మొనగాడా !
పదనారు వేల రాజ కన్యలకు ప్రియుడైన వాడా ! (పల్లవి)

శ్రీ వేంకటేశుడా ! నీ అందాలు ఎన్నెన్నో - చిందులేసెడి స్మరశత సుందరాంగుడా ! |
నీ కమలనయనాల సొగసులవె నర్తించు- పద్మావతీ హృదయ రంగమున యువతులవలె ||

బ్రహ్మోత్సవంబుల  గరుడ వాహన ! నీవు - తిరుమల వీధులలో ఊరేగింపులలో |
లలితంబుగా నూగుచు వయ్యారమొప్పుగ - అలరారు చుండేవు అరవిందలోచన ! ||

నీ అందమె అందమురా నీ కులుకె కులుకురా -నీ పలుకె పలుకురా నీ తళుకె తళుకురా |
మోహిని రూపధరుడ ! నవమోహనాకారా - నీ కమల కన్నులు చాలురా నాచూపు నిలుపంగ ||

అలివేలు మంగయును అలుక బెట్టును వీడి - అంతఃపురమున నిలిచి ఆలోకించునదిగో |
గరుడ హనుమదాదుల నధిరోహించి నీవు - ఊరేగింపులలో వెడలు వయ్యారమును ||

బ్రహ్మరధము  పైన  బ్రహ్మోత్సవాలలో - బ్రహ్మాండవాసులగ బ్రహ్మాదులె నిరీక్షించ |
నీ శయ్యయగు శేషుని నేరుగఁజూచేవు - వాలు చూపుల పద్మను కన్నుగీటేవుగా ! ||

పట్టెనామాలతో పట్టు పీతాంబరమ్ముతో - మెరయు వజ్రాభరణాల జనసాగరమ్ములో |
గాంభీర్యముగ నూరేగింపుచుండ - నిను జూచు భక్తులే నిత్యముక్తులు బ్రహ్మానందమదియె ||

 

 
 whatsnewContactSearch