home
Shri Datta Swami

 02 Feb 2002

గౌరి పరీక్షకు బ్రహ్మచారిగా

(సతీదేవి హిమవంతునకు పార్వతి నామధేయముతో జన్మించి, శివుని వరించి తపము చేయుచున్నప్పుడు శివదేవుడు కుహనావటువు రూపంలో వచ్చి ఆమె దీక్షను పరీక్షించుట.)

గౌరి పరీక్షకు బ్రహ్మచారిగా వచ్చుచున్నాడు వామదేవుడు (పల్లవి)

సుందర తాపస తరుణ వేషమున -
బ్రహ్మతేజమే ప్రజ్వరిల్లగా।
కరముల దండ కమండలు ధారిగ -
పండితోత్తముడు హుటాహుటి నడచి॥
 
 
చరణ పాదుకలు ధ్వనులను చేయగ -
బ్రహ్మ వర్చస్సు ముఖమున చిందగ।
తేజోమయ నయంబుల చూచుచు -
సన్న నవ్వు అధరంబున వెలయగ॥
 
 
విభూతి రేఖలు మధ్య కుంకుమము -
ఎర్ర కాశ్మీర శాలువ భుజముల।
వేదమంత్రముల తియ్యగ పలుకుచు -
బ్రాహ్మణ నైష్ఠిక గాంభీర్యముతో॥

 

 
 whatsnewContactSearch