home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

కాలకంధరా! ఇదె కార్తీక దీపం


 కాలకంధరా! ఇదె కార్తీక దీపం
నాగాభరణా ! ఇది నా ప్రాణదీపం
భక్తి తైలమై  ఙ్ఞానమె వత్తిగ
వెలిగింది దేవ ! నీ కోసమేను (పల్లవి)

నా బాష్పధార - గంగా జలమై | గద్గద గళమే - డమరు నాదమై |
తనువున కంపమె - శివతాండవమై | (నను) నీ పాదధూళి - కణమై పోనీ ! ||

అహంకారినై - పాపాత్ముడినై | పతితుడనైతిని - పరమేశా |
నీవె కాదన్న - నేనేమి చేతు | నీ పదముల పడి ఏడ్చెదను ||

నాధ! నీవుండ - అనాధుడనైతి | కరుణార్ణవమా - కదలి రావేల ? |
(నీ) ఙ్ఞానాగ్ని నేత్ర - శిఖలో కాలెద | (నను) నీ దయా గంగలో-కలిసిపోనీ ! ||

ఏనాటికైన - నీవాడ నేను | నిను వీడి బ్రతుక - లేనీ కలిని |
నా ప్రాణనాధ - నీ చరణమందు | నా ప్రాణదీపం - ఆరిపోనీ ||

 
 whatsnewContactSearch