home
Shri Datta Swami

 16 Feb 2002

అమ్మా అమ్మా ఓ లలితమ్మా

(లలితా దేవి కీర్తన)

అమ్మా అమ్మా ఓ లలితమ్మా ! అమ్మా అమ్మా ఓ లలితమ్మా।
శక్తివయ్యు నిరహంకారిణివే ! వాణివి లక్ష్మివి గౌరివి అనఘవు॥
దత్తాంకపీఠ విరాజమానా ! (పల్లవి)

నీ కనుబొమలవి కదలగచేయును।
సృష్టి స్థితిలయములనే దత్తుడు।
పరబ్రహ్మమను సింహాసనమున।
ఓ అధిష్ఠాన దేవతా ! ప్రణతి॥
 
 
కాపాడు తల్లి! కరుణించవమ్మ।
నీ ఆజ్ఞ లేక దత్త మౌనమే।
శివుడు దాగుకొనె తరంగ రూపిణి !।
లింగాకృతి నిను నర్చించమనుచు॥
 
 
లలిత నాడులను ఆవేశించిన।
చైతన్య శక్తి లలితయందురిల।
ఆదిజీవుడవు ప్రథమోహవుగా।
తపించు ఊహకు దాసుదు దత్తుడు॥
 
 whatsnewContactSearch