home
Shri Datta Swami

 08 Jun 2025

 

బ్రహ్మలహరి - దివ్యదర్శనముల నిచ్చుట - 12

బొంబాయిలో దివ్యదర్శనము.

[శ్రీ సూర్యనారాయణ, శ్రీమతి భాగ్య (ఫణి సోదరి)]

ఫణి బొంబాయికి పనిమీద వెళ్ళటం తటస్థించింది. అచట ఒకరోజు స్వామిని గురించి ఆలోచిస్తున్నాడు. ఒక దివ్యదర్శనమైనది. స్వామి భుజానికి సంచి తగిలించుకొని కనపడినారు. పైన దేవతలు, ఋషులు కనపడినారు. ఈ విచిత్రదర్శనానికి ఫణి ఆశ్చర్య చకితుడైనాడు. ఇంతలో దేవతలు, ఋషుల మాటలు ఇలా వినపడినవి. “వీడెవడురా నాయనా! సృష్టి నియమాలన్నింటినీ శాసిస్తున్నాడు! అవును ఇతడే దత్తుడు. జ్ఞాన - భక్తి ప్రచారానికి మహామాయను దట్టంగా కప్పుకుని భూలోకానికి వచ్చాడు" అని ఇదే దివ్య రహస్యం!!

అదే రోజు అదే సమయంలో విజయవాడలో స్వామి! చిరునవ్వు చిందిస్తూ ఒక కొత్తపాటను ఆశువుగా పాడినారు. "బ్రహ్మర్షిర్వా దేవో వా స్యాత్ దత్తాత్రేయం కో జానాతి" అని అంటే బ్రహ్మర్షులైనా, దేవతలైనా కానీ, దత్తాత్రేయుని ఎవరు తెలుసుకొనగలరు?" అని అర్థము.

ఆహా! శ్రీదత్తభగవానులే నరరూపంలో ఈ లోకంలో సంచరిస్తున్నారని ధ్రువపరచటమే గదా! ఆ నరావతారుని దర్శించి, సేవించి వారి వచనామృతమును గ్రోలి ధన్యులమైన మన అదృష్టమే అదృష్టము గదా!

శ్రీదత్తా శరణమయ్యా! అని ప్రణమిల్లుదుము!!

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch