home
Shri Datta Swami

 18 Jun 2025

 

బ్రహ్మలహరి - దివ్యదర్శనముల నిచ్చుట - 22

స్వామి బాలకృష్ణునిగా దర్శనమిచ్చుట

[సుజాతగారి తల్లి (పద్మావతి)]

స్వామి సుజాత గారింటికి గత 5 రోజులనుండి మధ్యాహ్నం 3 గం॥కు వేంచేస్తున్నారు. ప్రతిరోజు 3 గం॥ నుండి సాయంత్రం 6 గం॥ వరకు భజన నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనానికి సుజాత వాళ్ళ అమ్మగారు రావటం విశేషం. మొదటి రోజున ఆమెకు స్వామి సాక్షాత్తు బాలకృష్ణుడుగా దర్శనమిచ్చి పులకింపచేశారు. ఆ పారవశ్యంలో ఆమె అన్నం కలిపి తన చేతితో తానే స్వామికి గోరుముద్దలు తినిపించి ధన్యురాలైనది. స్వామి ఆమెను సంతోషింపచేయటానికే 5 రోజులుగా (పంచాహ్నికంగా) వాళ్ళింటికి వచ్చి సత్సంగం చేస్తున్నారు. నిన్న స్వామి ఒక రహస్యాన్ని వెల్లడించి భక్తులను ఆశ్చర్య చకితులను చేశారు. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని పెదతల్లి రోహిణిదేవియేనట. అందుకే ఆమెకు శ్రీకృష్ణుడంటే అంత ఇష్టం అని వివరించారు స్వామి. చివరిరోజున కిరీటం, పింఛం, మురళితో ఆమెకు స్వామి కనిపించారు. స్వామి లలాటంపై మెరిసే మూడు తేజోబిందువులతో ఊర్ధ్వత్రిపుండ్రాలు ప్రకాశించినవట. ఆమె ఎంతో ఉద్వేగమునకు గురియై అశ్రువులు రాల్చినది. ఆహా! ఆమె ఎంత ధన్యురాలు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch