19 Jun 2025
భద్రకాళి దర్శనము.
మంగళగిరిలో సీతమ్మగారింట్లో, స్వామి ఒకరాత్రి నిద్రించుచుండగా, బయట పడుకున్న సీతమ్మగారికి 5 ని॥లు స్వామి గురకతో కూడిన నిద్ర మరల 5 ని॥ సంస్కృతములో పెద్దగా గద్దించి మాట్లాడుట మారి మారి వినిపించినవి. సీతమ్మగారు లేచి కిటికీ సందుద్వారా గదిలోకి చూడగా భద్రకాళి, సర్వాలంకారములతో నీలిరంగు చీరెతో, స్వామితో సంభాషిస్తూ దర్శనమిచ్చినది! తలుపు తట్టి లోపలకు పోదామని అనిపించినా, మరల వద్దని, పోయి పడుకున్నారు సీతమ్మగారు. సీతమ్మగారి నుండి ఈవిషయమును విని, భద్రకాళితో చేసిన సంభాషణ వివరములను గురించి స్వామిని అడిగితిమి. స్వామి ఇట్లు వచించినారు. "ఆమె జీవులను మహామారియను రోగము (ఎయిడ్స్) తో నాశనము చేయుదునని అంటున్నది. ఇంకా సమయము రాలేదని, అట్లు చేయవద్దని నేను గద్దించి చెప్పితిని". ఆహా! దత్తుడు తప్ప భద్రకాళినే గద్దించగల ధైర్యము ఎవరికి ఉన్నది!
★ ★ ★ ★ ★