home
Shri Datta Swami

 05 Jun 2025

 

బ్రహ్మలహరి - దివ్యదర్శనముల నిచ్చుట - 9

శ్రీవేంకటేశ్వరునిలో స్వామి దర్శనం

ఆ రోజుల్లో స్వామి రోజూ ఎర్రని స్వెట్టర్ ధరించేవారు. ఒకసారి ఒక విచిత్రం జరిగింది. అజయ్, ఫణి తిరుపతి వెళ్ళటం తటస్థించింది. శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళారు ఇద్దరూ. శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహములో స్వామి ఎర్రని స్వెట్టర్ వేసుకొని నవ్వుతూ దర్శనమిచ్చారుట. ఆహా, ఎంతటి విచిత్ర దర్శనము! ఆ యాత్రలో ముచ్చటగా మూడు సేవలు చేసుకోవాలని సంకల్పించారు అజయ్ గారు. “మీకు రెండుసేవలే ఈ రోజు లభిస్తాయి” అని స్వామి చెప్పారు. అయినా వదలకుండా ప్రయత్నించారు అజయ్ గారు. ఆ రోజు ఎంత ప్రయత్నించినా మూడవసేవ దొరకలేదు. ఆహా! అది దత్త దివ్య వాణి గదా!

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch