21 Jul 2025
రైలు ప్రమాదమునుండి రక్షించుట.
తిరుపతి నివాసి గండ్రకోట శివరామమూర్తి గారి యింట్లో స్వామి చేసే దత్తభజన జరుగుచున్నది. సరిగా ఉదయం 10 గంటలు అయినది. భజన చేయుచున్న స్వామి హఠాత్తుగా "దత్తుడిప్పుడు ఇక్కడ లేడు, ఎక్కడకో వెళ్లినాడు" అని మౌనంగా ఉన్నారు. అరగంట సేపు కన్నులు మూసుకున్నారు. ఏమీ అర్థంకాక అందరూ నిర్ఘాంత పోయారు. 10-30 గం॥కు కన్నులు తెరిచి “ఇప్పుడు దత్తుడు వచ్చేసాడు, పని ముగిసింది” అన్నారు. అప్పటికి ఎవరికీ ఏమీ అర్థము కాలేదు. ఆరోజు సాయంత్రానికి శివరామమూర్తిగారి కుమారుడు గోపి ఇంటికి వచ్చినారు. అప్పుడు గానీ విషయం అర్థంకాలేదు. గోపి ఇలా చెప్పసాగారు. ఆ రోజు ఆయన రైలులో తిరుపతి వస్తూ ఉన్నారు. సరిగా 10 గం॥కు రైలు ఆగింది. ఎవరో వ్యక్తి వచ్చి రైలును ఎర్రగుడ్డను ఊపుతూ ఆపినాడు. పట్టాలు కోసినారు దుండగులు! అని చెప్పి. 10.30 గం॥కు ఆ వ్యక్తి ఎటో పోయినాడు. ఆ పట్టాలు రిపేరు చేయించి, రైలు వచ్చినందువల్ల చాలా ఆలస్యమైనది! అని అయన చెప్పినారు. ఉదయం స్వామి “దత్తుడిప్పుడు ఇక్కడ లేడు” అన్న తరువాత ఆ రూపంలో పోయి కాపాడినారని తేలినది. ఆ దంపతులు వారి పుత్రుని రక్షించినందులకు స్వామికి ఎంతో కృతజ్ఞత తెలిపినారు. వారు ధన్యులు.
★ ★ ★ ★ ★