25 Jul 2025
ఉద్యోగమును రక్షించుట.
[అజయ్ అన్నగారు]
అజయ్ గారు ఒకనాడు వారి అన్నగారిని వెంటపెట్టుకొని వచ్చి స్వామి పాదాలకు నమస్కరించి “స్వామీ! మిమ్ములను ఏ కోరిక అడగలేదు. మా అన్నయ్యగారు వీరు. వీరిని హఠాత్తుగా ఉద్యోగమునుండి నిష్కారణముగా పొమ్మని యజమాని చెప్పినాడు, మీరే రక్షించాలి” అన్నారు. “సరే మీ అన్నగారి విషయం మా అన్నగారైన హనుమంతునికి చెపుతాను” అని అన్నారు కనులు మూసుకొని. తరువాత “మా అన్నగారు మీ అన్నగారి వద్దనే తప్పు ఉన్నదని అంటున్నారు, అడగండి” అని స్వామి అనగా, అజయ్ గారు తన అన్నగారి నుండి మెల్లగా విషయాన్ని రాబట్టినారు. ఆయన అన్నగారే స్వయంగా యజమానితో "నీవు జీతం పెంచకున్నచో వెళ్ళిపోతాను" అని బెదిరించగా యజమాని పొమ్మన్నాడే తప్ప నిష్కారణంగా పొమ్మని అనలేదు అని తేలినది! కానీ “యజమాని చాలా మొండివాడు మరలపోయి అడిగితే వినడు" అని అజయ్ అన్నగారు మరల పోవుటకు భయపడినారు. స్వామి "పొమ్ము నీ యజమానికి మా అన్న హనుమన్న చెప్పి వచ్చినాడు" అన్నారు. అజయ్ అన్నగారు వెళ్ళి అడిగినారు. యజమాని “అలానే మీ ఉద్యోగం మీరు చేసుకోండి” అని ప్రశాంతముగా సమాధానము నిచ్చాడు. ఎంత విచిత్రము!
★ ★ ★ ★ ★