home
Shri Datta Swami

 26 Jul 2025

 

శివలహరి - 15

స్వామి శ్రీ నరసింహ సరస్వతియే

ఆ రోజు శ్రీ నరసింహ సరస్వతి శ్రీశైలంలో కృష్ణానదిలో కలిసిపోయిన పుణ్యదినము. స్వామి ఆ రోజంతా దాదాపు శ్రీ దత్త భజనలు పాడుతూనే ఉన్నారు. మధ్యాహ్నం 12 గం. అయింది. శ్రీ నరసింహ సరస్వతి మధ్యాహ్న భిక్ష సమయమయింది. స్వామి కోసం ప్రత్యేకంగా సీతమ్మగారు గిద్దెడు బియ్యంతో అన్నం వండింది. (స్వామి అన్నం స్వల్పంగా తింటారు). భక్తులంతా ఇళ్ళకు పోయి భోజనాలు చేసి వస్తామన్నారు. “ప్రసాదం తిని వెళ్ళండి” అని స్వామి భాస్కరశర్మ సమారాధన కధను (గురుచరిత్రలోనిది) మనోరంజకంగా చెపుతూ “శ్రీ నరసింహ సరస్వతి ఇలా తమ శాలువను, గిద్దెడు బియ్యం అన్నం కల చిన్న పాత్రపైకి విసిరినారు”. అంటూ చేతులను వంటయింటిలోని అన్నం పాత్రమీదకు విసిరినట్లుగా చూపించినారు. సీతమ్మగారు స్వామికి ఆ అన్న పాత్రలో నుండి వడ్డిస్తూనే ఉంది. అన్నం అక్షయంగా వస్తూనే ఉన్నది! స్వామి ముద్దలు చేసి 18 మంది భక్తులకు పెడుతూనేఉన్నారు. చివరకు పెరుగు అన్నము నిమిత్తంగా అన్నం వడ్డించటంతో పాత్ర ఖాళీ అయింది! స్వామి దత్తావతారులే కదా! అన్నాన్ని అక్షయం చేయటం వారి అనంత శక్తికి సాధ్యమేకదా! స్వామి సాక్షాత్తు నృసింహసరస్వతియే అని నిరూపించారు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch