28 Jul 2025
సర్వజ్ఞత.
[శేషమ్మ, సుబ్బారావుగారు (గాయత్రి తల్లిదండ్రులు)]
కువైట్ నుండి చి॥సౌ॥ గాయత్రి ఆమె తల్లిగారికి ఫోన్ చేసింది (ఈమె మరియు ఈమె భర్త చంద్రశేఖర్ గారు దత్తవేదం తృతీయ ముద్రణం చేసి ప్రచారం చేసిన ధన్యులు). తమ పుత్రిక సరిగా చదవటంలేదని, స్వామికి చెప్పమని. ఆమె తల్లిగారు ఆ విషయం చెప్పటానికి వచ్చింది. ఆమె చెప్పకుండానే, స్వామి ఆ రోజు సరస్వతీమాత మీద ఆశువుగా, అద్భుతమైన భజన “భజరే వీణా పాణిం” అను పల్లవితో పాడినారు. స్వామి ఆనాటి వరకు సరస్వతీదేవిపై ఎప్పుడూ భజన చెప్పలేదు. గాయత్రి తల్లిగారు విషయం చెప్పగా స్వామి "ఇంతవరకూ ఏనాడూ సరస్వతిని స్తుతించని నేను ఈనాడు ఎందుకు ఈ భజన చెప్పాను? మీ గాయత్రి ఫోన్ చేసిన విషయము గుర్తించియే గదా. ‘భజరే వీణాపాణిం’ అని నేను ఇప్పుడు పాడిన భజన పల్లవి అర్థము ఏమిటి? సరస్వతీదేవిని ప్రార్థించుము అనియే గదా. ఆ సందేశమునే మీ అమ్మాయికి చెప్పండి" అన్నారు స్వామి. ఫెయిల్ అవుతుంది అనుకున్న ఆ అమ్మాయి ఫస్టుక్లాసులో ఉత్తీర్ణురాలైనది!
★ ★ ★ ★ ★