29 Jul 2025
సూర్యుని కనుమరుగు చేయుట.
2002 సం|| ఏప్రియల్ 28వ తేది, అనేక భక్తుల సమూహంలో స్వామి కృష్ణలంకలో మాఇంట్లో దత్త నిలయంలో బ్రహ్మయజ్ఞమును చేసినారు. ఆనాటి ఉపన్యాసములో యజ్ఞస్వరూపాన్ని ఎంతో ఆశ్చర్యకరమైన వేద రహస్యాలతో వివరించినారు. అది ఎండాకాలం గదా. యజ్ఞసమయంలో సూర్యుని ఎండతీవ్రతకు అందరూ భయపడినారు. కానీ స్వామి సూర్యుని వైపుకు తీక్ష్ణంగా చూసారు. అంతే! కారుమేఘాలు కమ్మి సూర్యుడు మబ్బులచాటుకు పోయినాడు! అందరూ యజ్ఞం ముగిసి ఇళ్ళకు చేరిన తరువాత సూర్యదేవుని ప్రతాపం సాగింది.
“సూర్యుడు కూడా ఈ విశిష్టయజ్ఞాన్ని చూడాలని ఆరాటపడటం వలన సరేనన్నాను. అందుకే యజ్ఞసమయంలో కొంతసేపు చూడనిచ్చాను. స్వామి కార్యానికి సూర్యుడెందుకు సహకరించడు? ‘ఎండ’ ‘ఎండ’ అని మీరు విశ్వాసం లేక గోల చేసారు”. “భీషోఽదేతి సూర్యః” అని శ్రుతి గదా. పరబ్రహ్మ భయముతో సూర్యుడు ఉదయించుచున్నాడని కదా అని అన్నారు స్వామి. ఆనాడు శ్రీకృష్ణపరమాత్మ సూర్యునికి తన చక్రము నడ్డువేయుట గుర్తుకు రావటం లేదా!
★ ★ ★ ★ ★