31 Jul 2025
శ్రీమతి సరిత అనుభవము.
గుంటూరులో లలితా భక్తురాలైన సరితగారు ఒకనాడు బాగా దుఃఖించుచుండగా, స్వామి ఆమెకు సాక్షాత్కరించి “నేనున్నానుగా” అని పలికి వీపుమీద బాగా చరచినారట. ఆమె ఫోను చేసి చెప్పగా స్వామి "గట్టిగా చరిచినాను. నెప్పిపుట్టినదా" అని అడుగగా ఆమె "అవును స్వామీ, ఆ మంట చాలాసేపు ఉన్నది" అన్నారు. స్వామి నవ్వుతూ సారీ చెప్పినారు!
★ ★ ★ ★ ★