03 Aug 2025
మన స్వామి ఆనాటి కృష్ణుడే.
స్వామి 18 సం॥ వయస్సులో నున్నప్పుడు తల్లి, మేనత్తలతో కలసి తీర్థయాత్రలకు వెళ్ళినారు. బృందావనంలో స్వామి చెట్ల మీదకు ఎక్కి కొమ్మలపై కూర్చుని, ఆనందముతో మురళిని వాయించినారు. ఎంత సేపటికి దిగిరాలేదు. గుడికి పోవలెనని ఆదుర్దాలో తల్లి, మేనత్తలిద్దరూ స్వామిని దిగి రమ్మన్నారు. స్వామి వారితో “నన్ను చూడలేని వారు నా విగ్రహమును చూడగలరా” అని నవ్వుతూ అన్నారు. “వీడితో ఎందుకు?” అని అనుకుని ఇరువురూ గుడికి పోయినారు. సాయంత్రం 4 గం॥ లకే గుడి తెరుస్తారని తొందర తొందరగా గుడికి చేరారే గానీ ఏమి లాభం, ఆ రోజున గుడి తలుపులు తెరవనే లేదు. 6 గం॥ల వరకు వేచి వేచి విసుగుపుట్టి తిరిగి బృందావనం వద్దకు వచ్చారు. స్వామి మురళీగాన నిమగ్నులై ఉన్నారు. అక్కడే 7 గంటలయింది. స్వామి దిగి వచ్చి “పదండి, గుడి తలుపులు తెరిచినారు” అని గుడి వద్దకు తీసుకువెళ్ళినారు. అదే సమయములో అర్చకుడు వచ్చి గుడి తలుపులు తెరుస్తున్నాడు. ఇద్దరూ అర్చకుడిని ఆ రోజు ఆలస్యానికి కారణమడిగినారు. అర్చకుడు తాను పొరుగూరు పోయినాననియు, 4 గం॥లకు మరొకరిని ఏర్పాటు చేయగా అతడును హఠాత్తుగా వేరొక పని మీద పోయినందున అట్లు జరిగినదనియు చెప్పినాడు! దీని ద్వారా విగ్రహాదుల కన్నను నరావతారము సంపూర్ణమైనది అని స్వామి ఈనాడు చెప్పు సిద్ధాంతము ఆనాడే నిరూపితమైనది గదా!
★ ★ ★ ★ ★