09 Aug 2025
ఒక చిన్న భక్తురాలితో ఆడుకొనుట
[09-10-2002] పద్మ, వెంకటేశ్వరరావు దంపతులు స్వామి భక్తులు. వారి రెండవ పుత్రిక సుష్మను స్వామి ముద్దుగా శ్యాంరసియా అని పిలుస్తారు. శ్యాంరసియా తల్లి తండ్రులతో పాటు పూరీ తీర్థయాత్రలకు వెళ్ళినది. ఆ రోజు రాత్రి వారు పూరీలో బీచులో గాఢాంధకారంలో ఉన్నారు. చీకటి గదా, అందుకే అందరికీ భయం వేసినది. శ్యాంరసియాకు వెంటనే స్వామి తన పక్కనే సాక్షాత్కరించి నేనున్నాను భయం ఎందుకు అని అన్నారు. పూరీ గుడిలో అందరూ దేవుని దర్శించుచుండగా గుడిలో స్వామి స్తంభాల చాటున నక్కి, నక్కి కనపడుతూ శ్యాంరసియాతో ఆడుకున్నారట! ఎంతటి మహిమ - ఇది ఆ చిన్నారికి రెండవ అనుభవం.
★ ★ ★ ★ ★