home
Shri Datta Swami

 10 Aug 2025

 

శివలహరి - 30

స్వామి క్రీడావినోదము

[12-10-2002]

స్వామి ఈ రోజు మా ఇంటికి రాలేదు. అందరమూ పైన ఉన్నాము. మా కోడలు శ్రీలక్ష్మి తన కుమారుడు బాలకృష్ణతో స్వామి పైన ఉన్నారేమో చూచిరమ్మని పైకి పంపినది. దిగివచ్చి స్వామి మరియు అక్కడ ఉన్న భక్తుల పేర్లు చెప్పినాడు. వాడు చెప్పిన పేర్లులో స్వామి, సుమతి పేర్లు ఉన్నవి. కానీ ఆరోజు స్వామి లేరు, అక్కడికి రాలేదు కావున భక్తురాలు సుమతి కూడా రాలేదు. ఆవిడ ఆ రోజు తన ఇంట్లోనే ఉన్నది. మా కోడలు కొంతసేపు ఆగిన తరువాత ఎవరో స్వామి కొరకు ఫోన్ చేసినందున స్వామి ఉన్నారేమో చూచి రమ్మన్నది. వాడు పైకి వెళ్ళి వచ్చి స్వామిని చూచి ఉన్నారని చెప్పినాడు.

ఇంతలో సుమతి మెట్లు ఎక్కుతూ మా భాస్కరుకు కనిపించినది. ఇదంతా తెలియని మేము చివరకు అంతా క్రిందకు దిగి వచ్చినాము. మమ్ములను అడుగగా స్వామి పైన లేరని చెప్పినాము. స్వామి బాలకృష్ణకు కనిపించుటయే కాక, సుమతిరూపంలో మా కుమారుడు భాస్కరుకు కూడ కనిపించినారు! ఇదంతా స్వామి క్రీడావినోదమని భావించి సంతోషించితిమి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch