11 Aug 2025
స్వామి సర్వత్ర ఉన్నారని నిదర్శనము
[15-10-2002]
శ్రీ శర్మగారు విజయవాడలో నివసించు స్వామి భక్తులు. వీరు బొంబాయి వెళ్ళటం జరిగినది. 15-10-2002 విజయదశమి. అక్కడ పన్వేల్ లోని దుర్గామాతా మందిరం దర్శించినప్పుడు "గౌరీ కళ్యాణ వైభవమే" అని స్వామి రచించిన భజన పాడారట స్వామిని గుర్తుచేసుకుంటూ. వెంటనే స్వామి అక్కడే తాను ఉన్న నిదర్శనంగా విపరీతమైన సుగంధము శర్మగారికి సోకి సొమ్మసిల్లచేసినదట. ఎంతటి అద్భుతం!!
★ ★ ★ ★ ★