23 Jun 2025
బాలునకు ప్రాణభిక్ష
[శ్రీ ప్రభాకర్, చి. శ్రీకర్ (ప్రభాకర్ పుత్రుడు)]
విజయవాడ సత్యనారాయణపురంలో శ్రీ భీమశంకరంగారి ఇంట్లో ప్రభాకర్ అద్దెకు ఉంటున్నారు. అతడు స్వామి భక్తుడు. ఒకనాడు ప్రభాకర్ గారి బాబుకు చాలా పెద్ద జబ్బు చేసినది. “స్వామీ, రక్షించండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అని ప్రభాకర్ వచ్చి విలపించినారు. ఆ బాలుడు మాత్రం సామాన్యుడా! స్వామిని చూచిన చాలు, వచ్చి పాదాలకు నమస్కరించేవాడు. స్వామి ప్రభాకరునకు అభయమిచ్చారు. “నేను యమభటులను రానీయను” అంటూ ఆ రోజు వారింటిలోనే శయనించినారు. రాత్రి, తెల్లవార్లు ఆ దంపతులు మేలుకునే ఉన్నారు. అర్థరాత్రి అయినది. అర్థరాత్రి సమయమున యమభటులు రానే వచ్చారు. స్వామి వారిని పొమ్మని చెప్పుచున్నట్లు చేతులతో సైగలు చేసారు. అంతే! బాలుడు స్వస్థత పొంది ఆరోగ్యవంతుడైనాడు. ఇది మహిమ కాక మరేమిటి?
★ ★ ★ ★ ★