home
Shri Datta Swami

 21 Jun 2025

 

Telugu »   English »  

విష్ణులహరి - 1

విద్యార్థికి విచిత్ర వ్యాధిని పోగొట్టుట.

బందరులో రిటైర్డు ఇన్ కమ్ టాక్సు ఆఫీసరు సుబ్బారావుగారి కుమారుడైన ఇంజనీరింగ్ విద్యార్థికి తన స్వేద దుర్గంధము తనకే తెలిసి వికారపెట్టుట అగు వ్యాధి వచ్చెను. ఎందరో వైద్యులు చికిత్స చేసినా నిష్ఫలములయ్యెను. గ్రహజపములు, దైవారాధనములను ఎన్నో చేసిరి. ఎందరో మహాత్ములను ఆశ్రయించినా లాభము లేదయ్యెను. చివరకు ఆ తండ్రి స్వామిని చేరెను. ఇంతమందికి చేతకానిది నా వల్లకాదని స్వామి నిరాకరించెను. ఆ తండ్రి “నీవు దత్తుడవని భక్తులు చెప్పుచున్నారు. కావున నీవే నా దిక్కు” అని దీనాతిదీనముగా ప్రార్థించెను. స్వామి హృదయము ద్రవించి విభూతినిచ్చెను. ఆ విభూతిని తండ్రి పుత్రుని నుదుట పెట్టగనే ఆ రోగము మాయమయ్యెను. ఆ తండ్రి బంధుమిత్రులతో వచ్చి స్వామిని ఆరాధించినాడు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch