;
home
Shri Datta Swami

 25 Dec 2025

 

హిందూమత వివరణము (Part-2)

1. మతాంతరీకరణము వ్యర్థము:

అన్ని మతములు సమానమే మరియు మంచివే. ఏ మతములోనూ అధికముగా ఒక గుణముగానీ ఒక దోషముగానీ లేదు. ప్రతి మతములోనూ దోషములున్నవి. అయితే ఈ దోషములు ఆయా మతములలోని అజ్ఞాన – అహంకార - సంకుచిత జనులు సృష్టించినవే కానీ, మతముల సహజ ధర్మములు కావు. ప్రతి మేధావియు తన మతములోని దోషములు మతస్వభావములు కావు అని గుర్తించి వాటిని విశ్లేషించవలెను. అప్పుడు మతములోని దోషములనుండి మతములను వడబోయవలెను. అట్లు వడపోయబడిన మతములన్నియును శుద్ధవజ్రములవలె, తమ మధ్య ఎట్టి భేదము లేక ప్రకాశించుట ఆశ్చర్యకరముగా నుండును. దీని ఆధారముగా కృష్ణభగవానుడు గీతలో ఎవరునూ తమ మతమును త్యజించక చిట్టచివరి వరకు దానిలోనే ఉండవలెనని బోధించినాడు (స్వధర్మే నిధనం శ్రేయః - గీత). బట్టీబ్రాహ్మణుల వలన తమకు అవమానము జరిగిననూ సహించి, గీతావాక్యమును విశ్వసించి, పరమతములను స్వీకరించక, హిందూమతములోనే నిలచిన ధన్యులైన సర్వ స్త్రీలకునూ, శూద్రులకునూ, పంచములకునూ ఈ జ్ఞానసందేశము అంకితము.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via