home
Shri Datta Swami

పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారి దివ్య ఉపన్యాసములు

 Showing 1 – 20 of 230 Records

Translation: ENG 

ఉపోద్ఘాతము

వర్తమాన దత్తావతారులైన పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు తెలుగు భాషలో జ్ఞానసరస్వతి అను శీర్షికతో అనేకములైన దివ్యోపన్యాసములను అనుగ్రహించినారు. ఈ శీర్షిక క్రింద ఆ దివ్యోపన్యాసములన్నియును వరుసగా క్రోడీకరించి అందించబడును. సాధన అనగా ఏమి, సాధన ఏ విధంగా...(Click here to read)


హిందూమత వివరణము (Part-3)

Posted on: 26/12/2025

2. దోషములకు మూలకారణము:

అన్ని మతములలోను దోషములు ఏదో ఒక రూపములో ఉండుచునే ఉన్నవి. ఒక మతములో ఒక కోణములో దోషముండును, మరియొక కోణములో గుణము ఉండును. ఈ దోషములను వడపోసి, విసర్జించి పరమతములోని గుణములను తన మతములోనికి...

Read More→


హిందూమత వివరణము (Part-2)

Posted on: 25/12/2025

1. మతాంతరీకరణము వ్యర్థము:

అన్ని మతములు సమానమే మరియు మంచివే. ఏ మతములోనూ అధికముగా ఒక గుణముగానీ ఒక దోషముగానీ లేదు. ప్రతి మతములోనూ దోషములున్నవి. అయితే ఈ దోషములు ఆయా మతములలోని అజ్ఞాన – అహంకార - సంకుచిత జనులు...

Read More→


హిందూమత వివరణము (Part-1)

Posted on: 24/12/2025

ఉపోద్ధాతము:

హిందూ మతములో కుల, లింగ వివక్షలతో వచ్చిన చీలికలకు ప్రధానకారణములు - ఉపనయనము, గాయత్రీమన్త్రము, వేదాధ్యయనము, వేదోక్తములైన సంస్కారకర్మలు అందరికీ వర్తించక పోవుట, ఇవి కేవలము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పురుషలకు మాత్రమే పరిమితమగుట...

Read More→


నేను మీ ఇంట, మీ జంట, మీ వెంటనే ఉన్నాను

Posted on: 23/12/2025

[11.01.1996, గురువారము. రాత్రి 07.30 సమయము] శ్రీదత్తభక్తులు స్వామి సన్నిధిలో ఈ కీర్తన ఆలపిస్తున్నారు. “కనిపించు దత్తా, కనిపించు దత్తా, కనిపించు దత్తా నా కండ్లకు” అని. వెంటనే శ్రీదత్తప్రభువులు ఇలా వచించారు. “కనిపించుచున్నాను గదరా! ఇంకా కనిపించు, కనిపించు అని పాడతావెందుకు” అన్నారు. అప్పుడు దత్తభక్తులు స్వామితో, “స్వామీ మీరు నాకు కనిపిస్తున్నారు. కాని, నేను పాడినది...

Read More→


శ్రీషిర్డీసాయి విమర్శన ఖండనము (Part-9)

Posted on: 21/12/2025

ఉపసంహారము :

ఊహలకు సైతము అందని (నైషాతర్కేణ..., మాంతువేద న...) పరబ్రహ్మము, నర శరీరియగు ఒకానొక భక్తజీవుని ఆవేశించి, నరావతారముగ యీ లోకమున ప్రకటిత మగుచుండును. ధర్మమునకు సంభవించిన క్షోభను నివారించి శాంతిస్థాపనము చేయుటకును, మోక్షా సక్తులకు ముక్తి మార్గమునుపదేశించుటకును, భక్తులకు దర్శన, స్పర్శ, సంభాషణ, సహవాసములను చతుర్విధములగు అనుగ్రహములను ప్రసాదించుటకును, ధర్మమోక్షములందు జీవులను నడిపించుటకు...

Read More→


శ్రీషిర్డీసాయి విమర్శన ఖండనము (Part-8)

Posted on: 20/12/2025

10. జీవోద్ధరణము కొరకు దైవము సృష్టిలోనికి ప్రవేశించును:-

“అత్రిముని అనసూయలకు ముగ్గురు పుత్రులు పుట్టిరి. మొదటివాడు చంద్రుడు. మూడవవాడు దుర్వాసముని. మధ్యవాడు దత్తాత్రేయముని. శ్రీసాయి దత్తావతారమన్ననూ, దైవత్వము ఎచ్చటనూలేదు” అని శ్రీ సంపూర్ణానంద పలుకుట, వారు ఇంకను బాల్యావస్థలోనే ఉన్నారని నిరూపించుచున్నది...

Read More→


శ్రీషిర్డీసాయి విమర్శన ఖండనము (Part-7)

Posted on: 19/12/2025

9. విగ్రహారాధనము :

శ్రీసాయి విగ్రహముల నారాధించు వారు అపమార్గములో నున్నారని శ్రీ సంపూర్ణానంద ఆక్షేపించుట పిచ్చితనము. ఆరాధన లక్ష్యము సత్యమై, చేతనమై, యోగ్యమై ఉండవలెనని వారు చెప్పుచున్నారు. శ్రీసాయి విగ్రహములకు ఈ మూడింటిలో ఏ లక్షణము లేదని వారు చెప్పుచున్నారు. మిగతా దేవాలయ విగ్రహములకు ఈ మూడు ఉన్నవి కావున పూజ్యములని వారి భావన. ఈ మూడు, ప్రాణప్రతిష్ట ద్వారా సిద్ధించుచున్నవని వారి మతము. ఈ విధిలో ఆయా విగ్రహములలోకి ఆయా దేవతలను ప్రవేశింప...

Read More→


శ్రీషిర్డీసాయి విమర్శన ఖండనము (Part-6)

Posted on: 18/12/2025

8. వేదమంత్రముల నుదహరించుట :

వేదవచనములను ప్రమాణముగా తన ఉపదేశములలో చూపని శ్రీసాయి, దేవుడు కాడని శ్రీ సంపూర్ణానంద చేయు విమర్శ అనాలోచితము. వాల్మీకి రామాయణములో వాలి, జాబాలి మొదలగు వారికి ఉపదేశములను చేయునపుడు కూడా శ్రీరాముడు ఎట్టి వేదవాక్యములను ఉదహరించలేదు. శ్రీరాముడు బోధించినవి...

Read More→


శ్రీషిర్డీసాయి విమర్శన ఖండనము (Part-5)

Posted on: 17/12/2025

6. భగవదవతారముల సంఖ్య :

భాగవతంలో కలియుగ అవతారముల సంఖ్య 22 అనియు, వాటిలో శ్రీసాయి పేరులేదని మీరు ఆక్షేపించుటలో మీరు చూపిన పాండిత్యము మీ మూలమునకే ముప్పుతెచ్చుచున్నది. ఆదిశంకరులు భగవదవతారమని వేదములోనే చెప్పబడియున్నది...

Read More→


శ్రీషిర్డీసాయి విమర్శన ఖండనము (Part-4)

Posted on: 16/12/2025

4. శ్రీసాయి హిందూమతస్థుడే :

శ్రీ సంపూర్ణానంద, శ్రీసాయిని గురించి ఆయన ముస్లిం అనియు, హిందువు కాదనియు, ముస్లిం సంస్కృతిని హిందూమతములోనికి త్రోయుచున్నారనియు, ఆరోపించుట సరికాదు. శ్రీసాయి హిందూ బ్రాహ్మణుడు. ఆయన హిందూదేవతల నారాధించుచు, భక్తులను కూడా హిందూదేవతల నారాధించుటలో ప్రోత్సహించినారు. ఒకసారి వర్షములో తడియుచు...

Read More→


శ్రీషిర్డీసాయి విమర్శన ఖండనము (Part-3)

Posted on: 15/12/2025

3. శాకాహార మార్గము - దైవత్వము:

శ్రీ సంపూర్ణానంద, మాంసాహారి యగు శ్రీ సాయిబాబా దైవము కాదనుచున్నారు. ఆయనే శ్రీరాముని దైవముగా స్తుతించుచున్నారు. శ్రీరాముడు కూడా మాంసాహారియే కదా! సాయిని పూజించరాదని ఎట్లు చెప్పుచున్నారు? ఆహారము బాహ్యసంస్కృతియే. ఆయిననూ, ప్రాణివధ కారణమున మాంసాహారము పాపమే. కాని, భగవంతుడు ఒకచోట అవతరించినపుడు అచట నున్న జీవుల బాహ్యసంస్కృతిని తానూ అనుసరించి, వారితో ముందు సఖ్యతను ఏర్పరుచుకొనును. ఆ తరువాత...

Read More→


శ్రీషిర్డీసాయి విమర్శన ఖండనము (Part-2)

Posted on: 14/12/2025

2. మతముల ఐక్యత నిగూఢతర్క సాధ్యము:

స్వామి వివేకానంద ప్రపంచ పౌరుల సభలో మతసామరస్యమునకై ప్రయత్నించినారు. ఈ సందేశము నిచ్చు దత్తస్వామి, ఆ సామరస్యమును నిగూఢ తర్కవాదముతో సాధించుచున్నారు. దీనికి కారణమేమనగా - ప్రతి మానవుడును తనలో నున్న అత్యున్నతమైన బుద్ధియోగమును సమాధానపరచగల తర్కముతోనే...

Read More→


శ్రీషిర్డీసాయి విమర్శన ఖండనము (Part-1)

Posted on: 13/12/2025

[పీఠిక: 12-07-2014 గురుపూర్ణిమ నాడు భక్తులు శ్రీదత్తస్వామితో, ద్వారకాపీఠాధిపతి యగు శ్రీసంపూర్ణానందస్వామి, శ్రీ షిరిడీ సాయాబాబా మీద చేసిన ఆక్షేపణల గురించి ప్రస్తావించగా, శ్రీదత్తస్వామి ఇచ్చిన సందేశమే ఇది.]

ఈ రోజు గురు పూర్ణిమ. శ్రీ షిరిడీ సాయిబాబావారి మూలంగా ఈ పండుగ చాలా ప్రసిద్ధికి వచ్చినది. ఈ సందేశమునకు ఈ రోజు చాలా యోగ్యము. స్వామి సంపూర్ణానంద, లోతుగా విశ్లేషణ చేయకుండా బాబావారిపై ఆక్షేపణలనుచేసినారు. ఆయన చేసిన విమర్శలు ఆయననే కాక, ఆయన మూలగురువగు ఆది శంకరులనే వ్యతిరేకించు చున్నవి. హిందూమతములోని భిన్నసంస్కృతుల యొక్క మిశ్రమమైన స్మార్తమార్గమును శ్రీసంపూర్ణానందయే స్వయముగా అనుసరించుచున్నారు గదా.

1. భిన్న సంస్కృతుల మిశ్రమ - ఏకీకరణము:

రెండు భిన్న సంస్కృతి మార్గములను గురించి ఆలోచిద్దాము. ఈ రెండింటిలో ఒకటి సుప్రసిద్ధ శైవమతము, మరియొకటి సుప్రసిద్ధ వైష్ణవమతము. ఈ రెండు మతములు అంతరార్థ వేదాంతములందే...

Read More→


ఏది నా నిజమైన ఆరాధనము?

Posted on: 12/12/2025

[01-04-1993] ఆరోజు శ్రీదత్తస్వామి మా చేత శ్రీశైలములో శ్రీభ్రమరాంబ తల్లికి పూజ చేయించారు. ముగ్గురమ్మల చెంత దీపారాధన చేసి శ్రీసూక్తముతో, సౌందర్యలహరి, షోడశీమంత్ర సంపుటితో చిన్న పటం పెట్టించి భ్రమరాంబాతల్లికి కుంకుమార్చన చేయించారు. అపుడు అమ్మ ఇలా వచించింది – “నాన్నా! ఈ పూజలు తులాత్రాసులో తూచితే ఎడమ వైపు సత్యభామ తన ఐశ్వర్యముతో చేసిన పూజ, కుడివైపున రుక్మిణి, తులసి దళంతో చేసిన పూజలాగా ఉన్నది అని చిరునవ్వు...

Read More→


స్వామి రాబోవు అవతారములు

Posted on: 11/12/2025

[14.04.1992] శ్రీశైలములో శ్రీదత్తభగవానులు శ్రీదత్తస్వామి వారి ద్వారా ఈ క్రింది విధముగా వచించారు – “వాయవ్యకోణే సర్పదోష నివృత్తిః”. క్రిందటి రాత్రి వాయవ్యదిశలో సర్పం వచ్చినది. శ్రీదత్తభగవానులు శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుని రూపములో దర్శనమిచ్చి సర్పదోష నివారణ చేసినట్లు వివరించారు. నాకు, నా శ్రీమతికి అపమృత్యు దోషమును నివారించారు. అపుడు స్వామి చాలా ప్రసన్నులైనారు. వీరిద్దరు నా పుత్ర, పుత్రికలే కనుక వీరి ముందు జీవితం భగవదారాధనలో చక్కగా గడవటానికి వీరికి అపమృత్యు...

Read More→


దుస్సంగము త్యజించి సదా సత్సంగములో ఉండుడు

Posted on: 10/12/2025

[18.08.2004, సా|| 05:30 లకు] నేను (శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి), నా శ్రీమతి, శేషమ్మగారు, లలితగారు కలసి సత్సంగము కోసం శ్రీదత్తస్వామి దర్శనానికి సత్యనారాయణపురం వెళ్ళాము. స్వామి స్నానం చేసి వచ్చి భీమశంకరముగారి ఇంట్లో మధ్యగదిలో కుర్చీలో ఆసీనులైనారు. మేము కూడ కూర్చున్నాము. నేను, నాశ్రీమతి స్వామి పాదసేవ చేసుకున్నాము. స్వామికి అల్పాహారముగా దోసెలు సమర్పించినది నా శ్రీమతి. శ్రుతకీర్తి స్వామికై సమర్పించిన ధోవతి, టవలు, గురుదక్షిణలు స్వామికి సమర్పించాము. మాదంపతుల గురుదక్షిణ...

Read More→


పదిపైసల వంటి అష్టసిద్ధులు - కోట్ల విలువ కలిగిన జ్ఞానము

Posted on: 07/12/2025

[26.02.2002 రాత్రి] నాయనా శ్రద్ధగా విను. పూర్వజన్మలో నీవు విష్ణుదత్తుడవు. ఈమె నీ సతీమణి సుశీలమ్మ సోమిదమ్మ. మీకు సాక్షాత్కారము లభించిన సమయములో శ్రీదత్తుడనై నేను –“విష్ణుదత్తా! నీ తపోశక్తి వృథా పోరాదు. నీవు నా కార్యములో పాల్గోని నాసేవ చేయవలెనని ఆజ్ఞ ఇచ్చియుంటిని. మీదంపతులు ఇరువురు ఈ జన్మలో నా కార్యము చేయుటకు నిర్ణయింపబడినారు. కనుక నేను ఉద్యోగము సహితము మానుకొని మొదటిసారి శివరాత్రి...

Read More→


వర్తమాన అష్టమ దత్తావతారులు

Posted on: 04/12/2025

[24.02.2005] తారణనామ సంవత్సరము, మాఘ శుక్ల పూర్ణిమ, గురువారము] వర్తమాన అష్టమ దత్తావతారులు శ్రీదత్తస్వామి వారి జన్మదినోత్సవ సందర్భమున ఇందిరాటవర్సులో నేను, నాశ్రీమతి, కుమారుడు భాస్కరుతో కలసి శ్రీదత్తస్వామి వారి దర్శనము చేసుకొన్నాము. స్వామి హస్తమస్తకసంయోగము చేసి ఆశీర్వదించారు. శ్రీదత్తదివ్యవాణిని స్వామి ఇలా వినిపించారు – “నాయనలారా! శ్రద్ధగా వినండి. ఇప్పటికి శ్రీదత్తభగవానుడు మూడు పరిపూర్ణ దత్తావతారములలో అవతరించారు...

Read More→


నాటకము

Posted on: 02/12/2025

[03.05.2003] [ఈరోజు నా శ్రీమతి జన్మదినము. నేను (శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి), నా శ్రీమతి కలసి అజయ్‌ గారి ఇంట్లో ఉన్న శ్రీదత్తస్వామిని దర్శించి సేవించుకున్నాము.] మేము స్వామిని దర్శించుకున్నపుడు స్వామి “పుట్టుటయు నిజము పోవుటయు నిజము, మధ్యన ఉన్నది నాటకము, కానగ కన్నది కైవల్యము” అని పాడి ఇలా వివరించారు. పుట్టుట అంటే నాటకము ప్రారంభము అని అర్థము. పోవుట అంటే నాటకము పూర్తి కాగానే నటులు ఇళ్ళకు వెళ్ళుట అని అర్థము. మధ్యన ఉన్నది నాటకము అంటే నాటకము మధ్యలో కూడ నాటకమే అని అర్థము. ఉదాహరణకు రామారావు, అంజలి ఒక నాటకము వేసారు. అందులో వారు భార్యభర్తలుగా నటించారు నిజమే, కాని విచారిస్తే వాళ్ళు నాటకానికి ముందు...

Read More→


నిజమైన దత్తజయంతి

Posted on: 01/12/2025

[26.12.2004] దత్తజయంతి తారణ నామ సంవత్సరము నేను నా శ్రీమతి శ్రీదత్తస్వామివారిని దర్శించాము. ఆరోజు గురువారము. స్వామీ! ఈనాడు దత్తజయంతి కదా! మీరు దయచేయండి. మమ్ము అనుగ్రహించండి అని స్వామివారికి వినతి చేశాము. స్వామి చిరునవ్వు చిందించుచూ ఇలా వచించారు. “శ్రీదత్తభగవానుడు మానుషరూపంలో దత్తస్వామిగా వచ్చి అనుగ్రహిస్తున్నారు గదా! ఈ మానుష తనువుకు జయంతి 24 ఫిబ్రవరి. అదే నిజముగా దత్తజయంతి" అంటూ నవ్వారు. 24.02.2007 కు స్వామికి 60 సంవత్సరములు....

Read More→


 
 
 whatsnewContactSearch