;

16 Dec 2025
4. శ్రీసాయి హిందూమతస్థుడే :
శ్రీ సంపూర్ణానంద, శ్రీసాయిని గురించి ఆయన ముస్లిం అనియు, హిందువు కాదనియు, ముస్లిం సంస్కృతిని హిందూమతములోనికి త్రోయుచున్నారనియు, ఆరోపించుట సరికాదు. శ్రీసాయి హిందూ బ్రాహ్మణుడు. ఆయన హిందూదేవతల నారాధించుచు, భక్తులను కూడా హిందూదేవతల నారాధించుటలో ప్రోత్సహించినారు. ఒకసారి వర్షములో తడియుచు క్రింది మెట్టుపై నున్న సాయి, హనుమంతుని విగ్రహముకల పైమెట్టును భక్తులు ఎక్కమన్ననూ ఎక్కక, స్వామి కన్న క్రింది స్థాయిలోనే ఉండవలయునని పలికినారు. ఒకసారి ఒక ముస్లిం భక్తుడు తన ఆశీస్సులతో సంతానము పొంది, లడ్లు తీసుకొనిరాగా, శ్రీసాయి వాటిని హనుమంతుని గుడిలో పంచమని ఆదేశించిరి. “అల్లా హనుమంతులకు కుస్తీ జరుగగా, హనుమంతుడే గెలిచినాడు” అని పలికిరి. ఎప్పుడు “అల్లామాలిక్” అని పలుకు శ్రీసాయి, యిట్లు పలుకుట ఆ ముస్లిం భక్తుని మత దురభిమానమును పోగొట్టుటకే తప్ప, అల్లాపై భక్తి లేక కాదని గ్రహించవలెను. హిందూదేవతలపై శ్రీసాయి ఎంతో భక్తిని చూపించినారు. తాను హిందూబ్రాహ్మణుడననియు, ఉపనయనంలో కుట్టిన చెవులను శ్రీసాయి చూపెడివారు. ఒక దసరానాడు, తాను ముస్లిం అయినచో తనకు ‘సుంతి’ చేసినారా లేదా చూడమని దిగంబరుడై శ్రీసాయి కోపముతో కేకలను పెట్టినారు. ఇవి అన్నియును శ్రీసాయి హిందువనియే నిరూపించుచున్నను, ఆయన కొన్ని ముస్లిం పద్ధతులను అవలంబించుట, ఆ రెండు మతముల సమన్వయము కొరకేనని తెలియవలయును. వస్రధారణములో ఆయన తరువాత శ్రీ సత్యసాయిగా అవతరించినపుడు హిందు - కైస్తవ మత సమన్వయమును సూచిస్తూ మరొక ప్రయత్నమును చేసినారు.
5. శ్రీసాయికి గురుపరంపర ఉన్నది :
శ్రీసాయికి గురుపరంపర లేదని వారు చేసిన ఆక్షేపణయు నిజము కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడగు శ్రీవెంకుసాయే శ్రీసాయికి గురువు. శంకరాచార్య గురుపరంపరలను కూడా, సదాశివ - శంకరాచార్య పరంపరలో చెప్పినట్లు, వెంకటేశ్వర - వెంకుసా పరంపరయు నట్టిదే గదా. తన గురువగు శ్రీవెంకుసా తన కిచ్చిన ఇటుకరాయిని, శ్రీసాయి ఎంతో ప్రియముగా దాచుకున్నారు.
Tto be continued...
★ ★ ★ ★ ★