home
Shri Datta Swami

 20 Nov 2025

 

నిజమైన శివలింగము - నిజమైన అభిషేకము

శివలింగము అనగా చిచ్ఛక్తి (wave of awareness) తరంగము. అనగా జీవునిలో ఉండే చిచ్ఛక్తి స్వరూపమే శివలింగాకారమున ఉన్నది. ఈ శివలింగ చిచ్ఛక్తి స్వరూపమే జీవునిలో జఠరాగ్ని స్వరూపమున భాసించుచున్నది. ‘అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః’ ప్రకారముగా అన్నమును పచనము చేసి దాని నుండి చిచ్ఛక్తిని పుట్టించుచు జీవుని స్వరూపమును బలపరచుచున్నది (growing the body). కావున నిజమైన శివలింగము జీవునిలో ఉండు జఠరాగ్నియే. ఈ జఠరాగ్ని రూపమైన సత్యమైన శివలింగమునకు ఆహారమును అందించుటయే నిజమైన అభిషేకము, ఆరాధనము. అనగా ఆకలితో బాధపడువారి యొక్క జఠరాగ్ని స్వరూపమైన శివలింగమునకు పంచామృతములను ఆహారమును పెట్టుటయే నిజమైన పంచామృతాభిషేకము. అయితే ఈ అభిషేకమునకు అర్హులు కేవలము బాల, వృద్ధ, రోగులగు భిక్షుకులే కావలయును తప్ప, పని చేసుకొనగలిగియు సోమరితనముతో యాచించువారు కారు. అట్టి భిక్షుకులకు పెట్టు పంచామృతాహారమే అనగా పంచభక్ష్యములతో కూడిన ఆహారమే నిజమైన పంచామృతాభిషేకము. అంతే తప్ప, పాషాణ రూపమున నున్న శివలింగము పై పంచామృతములను కుమ్మరించి, వాటిని కొంత నేలపాలు చేసి, మిగిలినది ధనికులు తీర్థముగా తీసుకొనుట కాదని శ్రీదత్త సద్గురువుల అభిప్రాయము. అది కేవల పామర బోధకమగు ప్రతీకారాధనమే. జ్ఞానము, ప్రేమ – ఈ రెండే భగవంతుని యొక్క స్వరూపము. ఈ స్వరూపమే, భగవంతుని చేరు మార్గము కూడ అగును.

శ్రీదత్తుడు జీవుల యొక్క షడ్గుణములను రోగములను నయము చేయుటకు వచ్చిన వైద్యుడు. సిద్ధులను ప్రదర్శించిన లక్షల కొలది జీవులు మూగుదురు. అప్పుడు ఆయన నమయు చేయవలసిన రోగులు దూరమైపోవుదురు. కావున జీవులను దిద్దుకార్యములో సిద్ధులను ప్రదర్శించక కేవలము వైద్యము చేయు కార్యమున నుండునని గ్రహించవలయును.

Swami

శివలింగము:

భగవత్సంకల్పము ప్రకారము, భగవంతుని కార్యక్రమములో నిర్ణయించిన ప్రకారము ఏ పనైనా జరుగుతుంది. భక్తునికి ఎప్పడు, ఏ సమయంలో ఏది ప్రసాదించాలో అప్పుడు స్వామి అనుగ్రహిస్తారు. అట్లుకాక భక్తుడు నిస్పృహచెంది, తొందరపడి తాను సాధించాలని ప్రయత్నించడం స్వామి యొక్క కార్యక్రమానికి అడ్డు తగులటయే అవుతుంది గాని అది కార్య సాధకము కాదు. పైగా భక్తుడు సాధించ తలచినది తన తొందరపాటు వలన సాధించలేకపోగా తన కార్యం తన చేతులతోనే సర్వనాశనం చేసుకొంటాడు. కనుక జాగ్రత్త వహించండి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch