home
Shri Datta Swami

 20 Jul 2025

 

Telugu »   English »  

శివలహరి - 10

పుత్రుని అనుగ్రహించుట.

[శ్రీ ప్రసాద్, శ్రీమతి విజయ (ధర్మపత్ని)]

శ్రీ ప్రసాదు గారు విజయవాడలో స్టేటు బ్యాంకులో ఉద్యోగి. స్వామి భక్తుడు. పుత్రుని కొరకు స్వామిని ప్రార్థించగా స్వామి ఆశీర్వదించినారు. భార్య గర్భవతియైనది. కానీ 4వ నెలలో గర్భము జారిపోయినది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తుడైన ప్రసాదుగారు వెంకటేశ్వరస్వామి గుడిలో “ఇట్లేల చేసితివి”? అని బాధపడినారు. ఆ రోజు భజనకు రాగానే "మ్రొక్కిన వరమీని వేల్పు, గ్రక్కున విడువంగవలయు" అని గదా ఈ మానవుల నీతిశాస్త్రము! స్వామి ఎవరికీ అపకారము చేయడు. వారి కర్మఫలముల ప్రకారమే జరుగును, ఫలమునిచ్చిన ప్రశంస. ఫలము జారినచో తిట్లు! అని చెప్పి ప్రసాదుకు ఫలాన్ని ఆశీర్వదించి ఇచ్చినారు. ప్రసాదు గారి భార్య మరల గర్భవతియై ప్రసవ దినమున బిడ్డ అడ్డము తిరుగగా ఆపరేషను చేయవలసివచ్చెను. ఆమె రక్తము గ్రూపు ఎచ్చట తిరిగినా దొరకలేదు. ఆ సమయమున అజయ్ అక్కడ ఉండెను. ఆ రోజు ఉదయం స్వామి అజయ్ తో “ఎంత సంకటము వచ్చినా నేను రచించిన సంకటమోచన హనుమద్భజన చేసిన ఆ సంకటము విడిపోవును. ఇది ముమ్మాటికి సత్యము” అని చెప్పియున్నారు. అది గుర్తుకు వచ్చిన వెంటనే అజయ్ గారు, ప్రసాదుగారు సంకటమోచన హనుమద్ భజన చేసిరి. ఆపరేషన్, రక్తము అవసరము లేకుండానే సుఖ ప్రసవమయ్యెను. పుత్రుడు జన్మించెను. ఎంతటి కరుణ! ప్రసాద్ గారికి పుత్రభిక్ష పెట్టి ఆ దంపతులను అనుగ్రహించినారు స్వామి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch