12 Aug 2025
రైలును తక్షణం ఆపుట
[16-10-2002]
శ్రీమతి మాలతి స్వామి భక్తురాలు. స్వామిని సాక్షాత్తు దత్తభగవానులని విశ్వసించిన భక్తురాలు. స్వామి మాలతి వాళ్ళ ఇంటికి వచ్చి అప్పుడప్పుడు భిక్ష స్వీకరించడం జరుగుచుండగా, స్వామి మాలతితో ఇలా పదేపదే వచించినారు. "అడుగుము, ఇవ్వబడును" "ఆస్క్ దట్ షల్ బి గివెన్" “కేళుంగళ్ - కుడుకంబడుమ్” అని మూడు భాషలలో పదేపదే చెప్పినారు. ఐహికములను కోరుకొమ్మనమని స్వామి అడుగుచున్నారని భావించి "నాకేమీ వద్దు. ఇలా ఉంటే చాలు" అన్నది మాలతి. కానీ తరువాత రోజు ప్రయాణం చేయవలసి వచ్చినది. తాడేపల్లిగూడెంలో రాత్రి 8 గం||లకు తిరుమల ఎక్స్ప్రస్ రైలు ఎక్కాలి. రైలులో ఒక కుమారుడు ఎక్కినాడు. రైలు కదిలింది. తండ్రి రైలును పట్టుకొని పరుగెత్తుచున్నాడు. ఎక్కిన పిల్లవాడు రైలునుండి దూకటానికి సిద్ధమైనాడు. రైలు ఇంకా వేగం అందుకొన్నది. మాలతికి దిక్కుతోచలేదు. తత్తరపడింది. స్వామిని తలచుకొని ఎంతో తీవ్రస్వరంతో “స్వామీ” అని పెద్దగా కేక పెట్టినది. వెంటనే స్వామి సాక్షాత్కరించినారు. లుంగీ ధరించి, భుజాన సంచితో చెయ్యి పైకెత్తి "ఆపండిరా" అని కేకవేసినారు. రైలు తక్షణం ఆగినది. మాలతి రెండవ కుమారుడు, తండ్రితో సహా రైలునెక్కినది. పెట్టెలో అందరూ “ఏ దేవుడో నీ కోసమే వచ్చి ఆపినాడమ్మా రైలును” అని ప్రశంసించినారు.
ఇలా స్వామి మహిమలు అనాది- అనంతాలు. అందుకే స్వామి చెప్పినారు “నాన్తోఽస్తి మమ దివ్యానాం, విభూతీనాం పరంతప" (గీత) అని! అందువలన సమాప్తి లేని యీ గ్రంథమును ఇంతటితో సమాప్తి చేయుచున్నాము.
★ ★ ★ ★ ★