home
Shri Datta Swami

 13 Jun 2025

 

Telugu »   English »  

బ్రహ్మలహరి - దివ్యదర్శనముల నిచ్చుట - 17

దత్తచిత్రములో స్వామి కనిపించుట.

[సుగుణ]

ఫైర్ ఆఫీసరు ప్రభాకరంగారి తల్లి సుగుణ గారు. వసుమతి గారితో కలసి దత్తపీఠం వద్ద చిత్రపటం చూడటానికి కృష్ణలంకలోని మా ఇంటికి వచ్చినారు. ఆ చిత్రపటం చూసినప్పుడు సుగుణ గారికి దత్తప్రభువు చిత్రపటంలో స్వామి నవ్వుతూ కనిపించటంతో ఆమె ఆశ్చర్యచకితులయ్యారు. “వసుమతీ! చూడు, చూడు దత్తచిత్రపటములో స్వామి ఎలా కనిపిస్తున్నారో” అంటూ ఉద్వేగ భరితురాలైనారు. అప్పుడు వసుమతి గారు ఇలా అనుకున్నదట, మా ఇంటికి బయలుదేరునప్పుడు. స్వామి అసలు సాక్షాత్కరిస్తారా? అని మనస్సులో వసుమతి గారు అనుకొన్నదట!

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch