home
Shri Datta Swami

 02 Jun 2025

 

Telugu »   English »  

బ్రహ్మలహరి - దివ్యదర్శనముల నిచ్చుట - 6

స్వామి ఆదిపరాశక్తియే

[సరిత]

మొట్టమొదటిసారిగా తాను ఆశువుగా చెప్పిన భజనపాటను “గౌరీ కళ్యాణ వైభవమే”, “పారాణి పాద పద్మములవిగో, జగదంబవియట కదలుచున్నవే”, అంటూ పాడుతున్నారు స్వామి, ఒకసారి విజయవాడలో. ఇంతలో గుంటూరు నుండి సరితగారు వచ్చారు. ఆమె స్వామిని చూచి స్తంభించిపోయి స్వామి పాదాల మీద పడిపోయింది. ఆమె లలితాసహస్రనామాలను నిత్యమూ పారాయణం చేస్తుంది. స్వామి ఆమెకు లలితగా సాక్షాత్కరించడంతో తదేకదృష్టితో చూస్తోంది. పారాణితో, మెట్టెలతో, బంగారు గజ్జలపట్టాలతో పాదాలు ఎంత స్పష్టంగా కనిపించినవంటే, ఇప్పటికీ అవి ఆమె కన్నుల ముందు గోచరిస్తున్నవట! స్వామి నవ్వుతూ “అవి నా పెండ్లి నాటి పాదాలు” అన్నారు. దత్తుడికీ, శక్తికీ అభేదం అని బోధించటమే గదా ఈ సన్నివేశం.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch